Google AI | గూగుల్ ప్రాజెక్ట్ గ్రీన్ లైట్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్
వాహనాలు బారులుతీరడంతో ట్రాఫిక్ రద్దీ పెరగడమే కాకుండా కాలుష్యం కూడా ఆందోళనకరంగా పెరిగిపోతుంది. ఈ సమస్యకు టెక్ దిగ్గజం గూగుల్ (Google AI) ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా ఇలా భారత్‌లో ఏ నగరంలోనైనా ట్రాఫిక్ కష్టాలు కనిపించడం మామూలే. ట్రాఫిక్ జామ్‌లు నగరాల్లో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంటాయి. వాహనాలు బారులుతీరడంతో ట్రాఫిక్ రద్దీ పెరగడమే కాకుండా కాలుష్యం కూడా ఆందోళనకరంగా పెరిగిపోతుంది. ఈ సమస్యకు టెక్ దిగ్గజం గూగుల్ (Google AI) ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. కొన్ని ప్రముఖ నగరాల్లో ఈ ప్రాజెక్టును గూగుల్ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.
హైదరాబాద్, బెంగళూర్, కోల్‌కతా సిటీల్లో గూగుల్ ఏఐ ఏ విధంగా ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నదనే వివరాలను షియామి మాజీ ప్రోడక్ట్ మేనేజర్ సుదీప్ సాహు చేసిన ట్వీట్ నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది. గూగుల్ ప్రాజెక్ట్ గ్రీన్ లైట్లో భాగంగా బెంగళూర్‌లో న్యూ ట్రాఫిక్ లైట్స్‌ను అమర్చారు. నగరంలో వివిధ ఇంటర్సెక్షన్స్లో ట్రాఫిక్ ఫ్లో విషయంలో ప్రాజెక్ట్ గ్రీన్ లైట్ సహకరించడం ద్వారా వాహనాల నుంచి ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం జరుగుతుంది.
ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించే వీడియోను కూడా సాహు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివిధ నగరాల్లో వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను తగ్గించేందుకు ప్రాజెక్ట్ గ్రీన్ లైట్ గూగుల్ ఏఐ టెక్నాలజీని వాడుతుందని ఈ వీడియో వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో డ్రైవింగ్ ట్రెండ్స్ ఆధారంగా గూగుల్ మ్యాప్స్ డేటాను అనలైజ్ చేస్తూ ఈ ప్రక్రియను చేపడతారు. దీని ఆధారంగా ట్రాఫిక్ లైట్స్ టైమింగ్‌ను, కోఆర్డినేషన్‌ను నిర్ధేశిస్తారు.
Read More :
Kundara Johny | చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

