చెన్నై : చమురును రవాణా చేస్తున్న ఒక గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరు స్టేషన్లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. స్టేషన్ నుంచి బయలుదేరుతుండగా వ్యాగన్లకు నిప్పంటుకోవడంతో పలు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. 18 వ్యాగన్లు దగ్ధమయ్యాయి.
మంటలు మిగిలిన ట్యాంకర్లకు వ్యాప్తి చెందకుండా 30 ట్యాంకర్లను రైలు నుంచి విడగొట్టి దూరంగా తరలించారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని అధికారులు చెప్పారు.