Indian Railways | న్యూఢిల్లీ, మార్చి 26: రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులకు ఒక కొత్త సౌకర్యాన్ని భారతీయ రైల్వే ప్రకటించింది. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు వరకు ప్రయాణికులకు తాము రైలు ఎక్కే(బోర్డింగ్) స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటును రైల్వే శాఖ కొత్తగా కల్పించింది.
గతంలో రైలు బయల్దేరడానికి కనీసం 24 గంటల ముందు మాత్రమే బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే అవకాశం ఉండేది. అదనపు చార్జీ చెల్లించకుండా ప్రయాణికులు తమ బోర్డింగ్ పాయింట్‌ను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. అయితే రైలు బయల్దేరడానికి 24 గంటల లోపున బోర్డింగ్ స్టేషన్ మార్చుకున్న పక్షంలో ప్రయాణికులకు రీఫండ్ మాత్రం రాదు.