న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటించింది. ఈ చర్య సమానత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా దివ్యాంగుల సాధికారతకు కీలక ముందడుగని ఈ సందర్భంగా కేంద్రం పేర్కొన్నది.
నివాసాల కేటాయింపులో ఈ రిజర్వేషన్ దివ్యాంగులకు గౌరవం, సమానత్వం, సౌలభ్యతను అందించడంలో సహాయపడుతుందని, అలాగే వారికి ప్రభుత్వ పథకాల అందుబాటును పెంచుతుందని కేంద్రం పేర్కొన్నది.