న్యూఢిల్లీ: భారత్లో సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. నిరుడు నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్ల(కార్మిక సృతులు) ప్రకారం ఇకపై ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హత సాధించాలంటే ఐదేండ్ల పాటు వేచి ఉండనక్కర లేదు. ఏడాది సర్వీసుకే వారు గ్రాట్యుటీకి అర్హత పొందుతారు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి.
2025 నవంబర్ 21 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పర్మినెంట్ ఉద్యోగులకు గతంలో లాగా ఐదేండ్ల నిబంధన వర్తిస్తుంది. అయితే వారు ఐదేండ్లు కాకుండా సర్వీసులో ఉండగా మరణించినా, వైకల్యం పొందినా గ్రాట్యుటీకి అర్హత సాధిస్తారు. అలాగే రాతపూర్వక ఒప్పందం కింద నిర్దిష్ట కాలానికి నియమించిన నిర్ణీత కాల ఉద్యోగులకు ఒక సంవత్సరం నిబంధన వర్తిస్తుంది.