DA Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు (central government employees) ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ (కరవు భత్యం) 2 శాతం పెంచింది. డీఏ పెంపు (DA Hike) ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. తాజా నిర్ణయంతో జూలై ఒకటి నుంచి చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్ రేటు 53శాతం నుంచి 55శాతానికి పెరిగింది. కేంద్రం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు కోటిమందికిపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఇందులో 48లక్షల మంది ఉద్యోగులు, 67లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.
ప్రస్తుతం 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (dearness allowance) పెంచుతుంది. ఇది జనవరి, జూలైల్లో జరగాల్సి ఉన్నప్పటికీ ఏటా మార్చి, అక్టోబరులో ప్రకటిస్తూ వస్తోంది. ఆలస్యంగా ప్రకటించినా.. బకాయిలతో కలిపి జనవరి, జూలై నుంచే చెల్లిస్తారు. ముఖ్యంగా డీఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్‌ను (AICPIN-IW) ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఇదే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది. గతేడాది అక్టోబర్‌లో దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచిన విషయం తెలిసిందే. కేంద్రం డీఏను సరవించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది.
Also Read..
Actor Vijay | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్యనే ప్రధాన పోటీ : నటుడు విజయ్
PM Modi | క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాం.. మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపంపై మోదీ ట్వీట్
Techie Kills Wife | భార్యను చంపి శవాన్ని సూట్‌కేసులో కుక్కిన టెక్కీ.. పారిపోయి ఆత్మహత్యాయత్నం