న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్‌లో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు.. రూ. 42 కోట్ల విలువ చేసే 85 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని హాంగ్‌కాంగ్ నుంచి ఇండియాకు ఎయిర్‌కార్గో ద్వారా తరలించినట్లు డీఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందింది.
దీంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు దక్షిణ కొరియాకు చెందిన వారు కాగా, మరో ఇద్దరిలో ఒకరు తైవాన్, మరొకరు చైనాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. ఈ వారం మొదట్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రూ. కోటి విలువ చేసే 2.5 కిలోల బంగారాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.