పనాజీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ తీరానికి చేరువ అవుతుండటంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ గాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. తుఫాను తీరానికి మరింత చేరువైతే పరిస్థితి ఇంకా బీభత్సంగా మారే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. గోవా తీరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Goa's Panaji witness the spell of Cyclone #Tauktae pic.twitter.com/2gNU75Uzyq
— ANI (@ANI) May 16, 2021
Cyclone Tauktae hit coastal parts of Goa. Visuals from Panaji pic.twitter.com/qPGI0CnUjS
— ANI (@ANI) May 16, 2021