పనాజీ: గోవా నైట్‌క్లబ్(Goa Night Club)లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ నైట్‌క్లబ్ ఓనర్లు ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి వెళ్లారు. థాయ్‌ల్యాండ్‌కు వాళ్లు పరారీ అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన తక్షణమే.. ఓ బృందం ఢిల్లీ వెళ్లింది. అన్నాదమ్ముళ్లైన నిందితులు గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రాను అరెస్టు చేసేందుకు పోలీసులు ఢిల్లీ వెళ్లారు. వాళ్లు ఇంట్లో లేకపోవడంతో అక్కడ నోటీసు వదిలేశారు. ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు కూడా లుకౌట్ సర్క్యూలర్ జారీ చేశారు.
లుకౌట్ నోటీలు ఇవ్వడం వల్ల విమానాశ్రయాల్లోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద నిందితుల పేర్లతో ఉన్నవారిని చెక్ చేసి పంపిస్తారు. అయితే నిందితులు ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున 5.30 నిమిషాలకు థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్‌కు పరారీ అయినట్లు ముంబైలోని ఇమ్మిగ్రేషన్ బ్యూరో గుర్తించింది.గోవాలోని రోమియోలేన్‌లో ఉన్న నైట్‌క్లబ్‌లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దాని ఓనర్లు ఇద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు.