Go to Pak | పాకిస్థాన్ వెళ్లిపోండి.. ఇది హిందూ దేశం.. ముస్లిం విద్యార్థులపై టీచర్ ఆగ్రహం
పాకిస్థాన్ (Pakistan) వెళ్లిపోండి.. ఇది హిందూ దేశం అంటూ ఇద్దరు ముస్లిం విద్యార్థులపై ఓ టీచర్ ఆగ్రహం వ్యక్తంచేసిన ఘటన కర్ణాటకలోని (Karnataka) ఉర్దూ మీడియం స్కూల్లో (Urdu school) చోటుచేసుకున్నది.
బెంగళూరు: పాకిస్థాన్ (Pakistan) వెళ్లిపోండి.. ఇది హిందూ దేశం అంటూ ఇద్దరు ముస్లిం విద్యార్థులపై ఓ టీచర్ ఆగ్రహం వ్యక్తంచేసిన ఘటన కర్ణాటకలోని (Karnataka) ఉర్దూ మీడియం స్కూల్లో (Urdu school) చోటుచేసుకున్నది. శివమొగ్గలోని (Shivamogga) ఓ ఉర్దూ మీడియం స్కూల్లో ఓ మహిళా టీచర్ కన్నడ లాంగ్వేజ్ (Kannada Language teacher) బోధిస్తున్నది. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూమ్లో కొట్టుకుంటున్నారు. వారిని ఆ టీచర్ అడ్డుకున్నారు. అయితే ‘పాకిస్థాన్ వెళ్లిపోండి.. ఇది హిందువుల (Hindus) దేశం’ అని టీచర్ తమపై అరిచారంటూ విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో అధికారులు ఆమెను మరో స్కూల్కు బదిలీచేశారు. ఈ వ్యవహారంపై అంతర్గంతంగా విచారణ నిర్వహిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని విద్యాశాఖ అధికారి బీ నాగరాజు (B Nagraj) తెలిపారు. ఆమె గత ఎనిమిదేండ్లుగా అదే స్కూల్లో పనిచేస్తున్నారని, 26 ఏండ్ల అనుభవం ఉందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

