Go First Flight | గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పేర్కొంది. అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న గో ఫస్ట్ విమానాన్ని (G8911) పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని పైలెట్లు అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డీజీసీఏ పేర్కొంది.