న్యూఢిల్లీ : క్రిమినల్ కేసులో దోషిగా తేలిన రాజకీయ నాయకులు ఎంత మందిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించిందీ లేదా అనర్హతా కాలాన్ని తగ్గించిందీ వంటి వివరాలు అందచేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం(ఆర్పీఏ) 11 సెక్షన్ కింద ఎన్ని కేసుల్లో తన అధికారాన్ని ఉపయోగించిందీ రెండు వారాల్లో తెలపాలంది. ఆర్పీఏ కింద క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటుకు గురయ్యే కాలం ఆయా నేరాల తీవ్రతను బట్టి ఉంటుంది.