Rakhi festival : దేశంలో అప్పుడే రాఖీ సెలబ్రేషన్స్ (Rakhi celebrations) మొదలయ్యాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు జవాన్లతో కలిసి రాఖీ సంబురాలు జరుపుకుంటున్నారు. జవాన్లకు రాఖీలు కట్టి స్వీట్లు పంచుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని భారత్-పాకిస్థాన్ (India-Pakistan) అంతర్జాతీయ సరిహద్దు (International border) లో కూడా రాఖీ సంబరాలు జరిగాయి.
సుచేత్‌గఢ్ ఏరియాలోని సరిహద్దు గ్రామాలకు చెందిన బాలికలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లకు రాఖీలు కట్టారు. వారితో జవాన్లు సంతోషంగా రాఖీలు కట్టించుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. చిన్నారులు జవాన్లకు రాఖీలు కట్టిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Jammu, J&K: Girls tied Rakhi to BSF personnel and celebrated the Rakshabandhan festival on the Indo-Pak international Border in the Suchetgarh area pic.twitter.com/jAAGa8fPR9
— ANI (@ANI) August 18, 2024