ఈ సోషల్‌మీడియా యుగంలో ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోలు కామన్ అయిపోయాయి. ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు చాలామంది ప్రతిరోజూ ఏదో ఒక వీడియో తీస్తూనే ఉన్నారు. కాగా, ఓ యువతి టెర్రాస్‌పై డ్యాన్స్ వీడియో రీల్ షూట్ చేస్తుండగా ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను మీమోలజీ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్చేశారు. ఈ వీడియోలో ఓ యువతి టెర్రాస్‌పై నీళ్లల్లో ‘బర్సోరే మేఘా’ పాటపై డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. పాట చివర్లో నీళ్లలో జారిపడుతుంది. వెంటనే పైకిలేచి నవ్వుతుంది. వెంటనే కెమెరా ఆఫ్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా నవ్వాపుకోలేకపోతున్నారు. లాఫ్ ఎమోజీలు పెడుతూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.