బెంగళూరు: కర్ణాటకలో జికా వైరస్ కలకలం రేపింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది. డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఈ నెల 5న ముగ్గురు పేషెంట్ల నుంచి సీరమ్ శాంపిల్స్ సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి.
మూడు శాంపిల్స్‌లో రెండు నెగెటివ్ రాగా, మరొకటి పాజిటివ్‌గా వచ్చింది. ఓ ఐదేండ్ల పాపలో జికా వైరస్ ఉన్నట్లు బయటపడింది. కర్ణాటకలో ఇదే తొలి జికా కేసు అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నదని ఆయన తెలిపారు.