జైపూర్, మే 30 : ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ ప్రాంతాల్లో 100 అడుగుల ఎత్తులో ఇసుక తుఫాన్ చెలరేగింది. శనివారం మధ్యాహ్నం ఈ తుఫాన్ చెలరేగడంతో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. రోడ్లన్నీ కనిపించకుండా పోయి రాకపోకలు నిలిచిపోయాయి.
సముద్రంలో సునామీ వస్తే ఏ స్థాయిలో అలలు ఎగసిపడుతాయో.. ఇసుక తుఫాన్ దృశ్యాలు అలాగే అగుపించాయి. ఈ తఫాను అత్యంత భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది ఈ తుఫాన్. దీని దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ తర్వాత ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.