న్యూఢిల్లీ, మే 31: నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా ఎన్ రాజా సుబ్రమణి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సౌత్‌బ్లాక్ లాన్స్ లో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. శనివారం పదవీ విరమణ చేసిన జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన సుబ్రమణి మాట్లాడుతూ భారత రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు సైనిక, వైమానిక, నావికా, ఇతర సంబంధ సంస్థలన్నీ ఐక్యంగా ఉన్నాయన్నారు.
లండన్‌లో ఎంఏ, మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేసిన సుబ్రమణి 40 ఏండ్ల పాటు భారత సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి, జాతీయ భద్రతా మండలి సచివాలయంలో సలహాదారుగా ఉన్నారు. 2024 నుంచి 2025 వరకు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా వ్యవహరించారు.