బిపిన్ రావత్ చివరి మాటలు అవేనా.. కన్నీటి పర్యంతమైన ప్రత్యక్ష సాక్షి

Bipin Rawat final words |తమిళనాడులోని కూనూరులో బుధవారం జరిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? హెలికాప్టర్ కుప్పకూలిన తర్వాత ఏం జరిగింది? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జనరల్ బిపిన్ రావత్ కొద్దిసేపు ప్రాణాలతోనే ఉన్నారని.. చివరిసారిగా తనతో ఆయన మాట్లాడారని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
శివకుమార్ అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. మధ్యాహ్నం మేం పనిచేస్తున్న సమయంలో భారీ శబ్దం వినబడింది. అక్కడకు వెళ్లి చూస్తే చెట్టుకొమ్మలపై ఓ హెలికాప్టర్ మంటల్లో కాలుతూ కనిపించింది. ఆ ప్రదేశంలోని పొదల్లో మాకు ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలతో కనిపించారు. బహుశా.. వారిద్దరూ హెలికాప్టర్ నుంచి దూకేసి ఉంటారు. వాళ్ల వద్దకు వెళ్లి చూస్తే వాళ్ల బట్టలు పూర్తిగా కాలిపోయి ఉన్నారు. వారిలో ఒకరు దాహంగా ఉంది.. కొన్ని మంచినీళ్లు కావాలని అడిగాడు. కానీ మేం ఆయనకు ఏం కాదని ధైర్యంచెప్పి.. తప్పకుండా సహాయం చేస్తామని చెప్పాం. ఒక బెడ్ షీట్ సహాయంతో పొదల్లో నుంచి బయటకు లాక్కొచ్చాం. అప్పుడే రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నేను ఎవరో సాధారణ వ్యక్తి అనుకున్నాను. కానీ నేను మాట్లాడిన వ్యక్తి సీడీఎస్ బిపిన్ రావత్ అని కొంతమంది చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని అప్పుడే తెలుసుకున్నా. అని ఘటన జరిగిన తీరును శివకుమార్ వివరించాడు. ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడిన గొప్ప వ్యక్తి.. చివరి నిమిషంలో మంచినీళ్లు అడిగినా ఇవ్వలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పేలడానికి ముందు రావత్ హెలికాప్టర్.. వీడియో వైరల్
రావత్, ఆయన భార్య, మరొకరి మృతదేహం తప్ప.. మిగతా వాళ్లను గుర్తించడం కష్టం
New CDS appointment | కొత్త త్రివిధ దళాధిపతి ఎవరు?.. మరో 7 రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
Captain Varun Singh| ప్రాణాలతో బయటపడిన ఒకేఒక్కడు శౌర్యచక్ర వరుణ్ సింగ్
Bipin Rawat | బిపిన్ రావత్ కంటే ముందు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ప్రముఖులు వీరే..
Bipin Rawat | బిపిన్ రావత్ మరణానికి ముందు ఏం జరిగింది..?
Bipin Rawat death | గతంలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ రావత్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

