పేలడానికి ముందు రావత్ హెలికాప్టర్.. వీడియో వైరల్

ఊటీ : సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 బుధవారం నీలగిరి కొండల్లో కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నీలగిరిలోని టూరిస్టులకు ఆర్మీ హెలికాప్టర్ చిక్కినట్లు అర్థమవుతోంది. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఆ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది.
కింద నడుచుకుంటూ వెళ్తున్న కొందరు తమ సెల్ఫోన్ ద్వారా వీడియో తీస్తున్నారు. అయితే ఆ సమయంలో హెలికాప్టర్ శబ్ధం విన్నవాళ్లు.. ఆ హెలికాప్టర్ను తమ వీడియోలో బంధించారు. దట్టంగా ఉన్న పొగమంచుల్లోకి హెలికాప్టర్ వెళ్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. హెలికాప్టర్ పేలినట్లు ఆ వీడియోలో శబ్ధం వినిపిస్తోంది. ఊటీలో ఉన్న టూరిస్టులు కొందరు ఆ వీడియో తీశారు. ఆ హెలికాప్టర్ దిగువ స్థాయిలో ఎగురుతున్నట్లు వీడియోలో అర్థమవుతోంది. ఇక ఆ వీడియోలో ఉన్న వాళ్లు.. పేలిపోయిందా.. కూలిపోయిందా అనుకుంటూ తమిళ భాషలో కామెంట్లు చేసుకున్నారు. వాయుసేన ఈ వీడియోను ద్రువీకరించాల్సి ఉంది.
దట్టమైన పొగమంచులో రావత్ హెలికాప్టర్.. వీడియో వైరల్ pic.twitter.com/6HwhllYEDN
— Namasthe Telangana (@ntdailyonline) December 9, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

