PM Modi: మోదీ కాన్వాయ్ మార్గంలో దొరికిన జిలాటిన్ స్టిక్స్
PM Modi: ప్రధాని మోదీ ఆదివారం బెంగుళూరులో పర్యటించారు. హెచ్ఏఎల్తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్‌ను సందర్శించారు. అయితే మోదీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో రెండు జిలాటిన్ స్టిక్స్‌ను రికవరీ చేశారు. ఆ కాన్వాయ్ రావడానికి 30 నిమిషాల ముందే ఆ స్టిక్స్‌ను సేకరించారు.
బెంగుళూరు : ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం బెంగుళూరులో పర్యటించారు. హిందుస్థాన్ ఏరోనాటిల్ లిమిటెడ్‌తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్‌ను సందర్శించారు. అయితే మోదీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో రెండు జిలాటిన్ స్టిక్స్‌ను రికవరీ చేశారు. ప్రధాని మోదీ కాన్వాయ్ రావడానికి 30 నిమిషాల ముందే ఆ స్టిక్స్‌ను సేకరించారు. వదరహల్లి గేటు వద్ద ఆ జెలాటిన్ స్టిక్స్‌ను గుర్తించారు. పోలీసు కానిస్టేబుల్ జగదీశ్‌తో పాటు ప్రత్యేక చెకింగ్ బృందానికి ఆ స్టిక్స్ దొరికాయి.
ఓ కవర్లో జిలాటిన్ స్టిక్స్ పెట్టారు. ఎన్ఐసీఈ రోడ్డు జంక్షన్‌కు 1 కిలోమీటరు దూరంలో స్టిక్స్‌ను గుర్తించారు. అనుమానాస్పద కవర్ కనిపించడంతో ఆ కానిస్టేబుల్ సీనియర్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఈ కేసులో ఇంకా ఎవర్నీ అరెస్టు చేయలేదు. పేలుడు పదార్థం ఎలా ఇక్కడకు చేరుకుందన్న కోణంలో సెంట్రల్ రేంజ్ డీఐజీ ఎస్ గిరీశ్ విచారణ చేపడుతున్నారు. కోరమంగళం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
అయితే ఆ రోజు బెదిరింపు కాల్ చేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాల్లో పేలుడు జరుగుతుందని ఆ వ్యక్తి ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తిని లోహిత్‌గా గుర్తించారు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

