GDP data : ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా గంటన్నర ముందుగానే జీడీపీ డేటా (GDP data) ను రిలీజ్ చేయాలని భారత ప్రభుత్వం (Govt of India) నిర్ణయించింది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రస్తుత త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ అంచనాల డేటాను రిలీజ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఇతర మార్కెట్ల క్లోజింగ్ టైమింగ్స్‌ను పరిగణలోకి తీసుకుని గంటన్నర ముందుగానే డేటా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
మూడో త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ అంచనాల డేటాతోపాటు ద్రవ్యోల్బణం (Inflation), పారిశ్రామిక ఉత్పత్తుల సూచీ (Industrial products index) ని కూడా భారత ప్రభుత్వం ఈ సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ చేయనుంది. కేంద్ర గణాంక ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ ప్రతి త్రైమాసికం చివరి రోజున ఐదున్నర గంటలకు జీడీపీ అంచనాలను విడుదల చేస్తుంది.