Gautam Adani | అహ్మదాబాద్: దేశంలోని అపర కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ వివాహం దివా షాతో నిరాడంబరంగా జరిగింది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని అదానీ శాంతిగ్రామ్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల నడుమ ఈ వేడుక జరిగింది.
కాగా, కుమారుడి వివాహం సందర్భంగా గౌతమ్ అదానీ భారీ విరాళాన్ని ప్రకటించారు. విద్య, వైద్యం, నైపుణాభివృద్ధి వంటి రంగాల కోసం రూ.10 వేల కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో గౌతమ్ అదానీ తెలిపారు. ఈ రంగాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు చెప్పారు.