న్యూఢిల్లీ : హరియాణాకు చెందిన (gangster Yogesh Kadyan) గ్యాంగ్స్టర్ యోగేష్ కద్యన్ (19)పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో ఇంటర్పోల్ ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.
కాగా కద్యన్పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధ చట్టం ఉల్లంఘన వంటి పలు అభియోగాలు నమోదయ్యాయి. కద్యన్ భారత్ నుంచి పరారై అమెరికాలో ఆశ్రయం పొందినట్టు సమాచారం.
గ్యాంగ్స్టర్-ఉగ్ర ముఠాలపై జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపడంతో పలువురు గ్యాంగ్స్టర్లు అజ్ఞాతంలోకి వెళ్లగా మరికొందరు నకిలీ పాస్పోర్టులతో భారత్ నుంచి పరారయ్యారు. ఇక కద్యన్ సైతం నకిలీ పాస్పోర్ట్ ఉపయోగించి దేశాన్ని దాటినట్టు భావిస్తున్నారు.
Read More :
Sangareddy | గుజరాత్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 4.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత