తెరుచుకున్న గంగోత్రి ఆలయం.. భక్తుల దర్శనానికి నో ఛాన్స్
గంగోత్రి ఆలయ ద్వారాలు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ప్రముఖ ఆలయమైన గంగోత్రి ఆలయం తెరుచుకుంది. కొవిడ్ నేపథ్యంలో తలుపులు తెరిచే వేడుకను శనివారం ఉదయం నిరాడంబరంగా నిర్వహించారు.

ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ప్రముఖ ఆలయమైన గంగోత్రి ఆలయం తెరుచుకుంది. కొవిడ్ నేపథ్యంలో తలుపులు తెరిచే వేడుకను శనివారం ఉదయం నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ పూజారులతోపాటు కొద్ది మంది అధికారులు వేడకకు హాజయ్యారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణకు ఈ ఉదయం 7 గంటల 31 నిమిషాలకు తలుపులను తెరిచామని గంగోత్రి ఆలయ పూజారి రవీంద్ర సెమ్వాల్ తెలిపారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేసిన కొద్ది మంది అధికారులు, ఆలయ కమిటీ సభ్యులను మాత్రమే తలుపులు తెరిచే వేడుకకు అనుమతించినట్లు వెల్లడించారు. ఆలయం తెరిచిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ తరఫున తొలిపూజ నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది ఛార్‌దామ్ యాత్ర రద్దయ్యింది.
దీంతో సాధారణ పూజల నిర్వహణకు షెడ్యూల్ ప్రకారం హిమాలయ శ్రేణుల్లోని నాలుగు ఆలయాల తలుపులను తెరిచారు. యువనోత్రి ఆలయ తలుపులు గత నెల 14న, కేదర్నాథ్ ఆలయం 17న, బద్రీనాథ్ ఆలయాన్ని 18న తెరిచిన విషయం తెలిసిందే. ఆలయాన్ని తెరిచినా భక్తులనెవరినీ దర్శనానికి అనుమతించబోమని ఆలయ వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

