వారణాసి: ప్రధాని మోదీ ఇవాళ గంగా ఎక్స్‌ప్రెస్‌వే(Ganga Expressway)ను ప్రారంభించనున్నారు. దీని కోసం ఆయన కాశీ చేరుకున్నారు. అయితే హర్దోయ్‌లో ఆ ఎక్స్‌ప్రెస్‌వేను ఆయన ప్రారంభిస్తారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే సుమారు 594 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌గా దీన్ని నిర్మించారు. భవిష్యత్తులో దీన్ని 8 లేన్లుగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నది. సుమారు 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. మొత్తం 12 జిల్లాల మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే వెళ్తుంది. మీరట్, హాపుర్, బులంద్షార్, అమ్రోహ్, సంబల్, బదౌన్, షాజహన్‌పుర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌ఘర్, ప్రయాగ్‌రాజ్ జిల్లాలు మీదుగా ఈ రూట్ వెళ్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని వెస్ట్రన్, సెంట్రల్, ఈస్ట్రన్ ప్రదేశాలను ఈ రూట్ కనెక్ట్ చేస్తుంది. గంగా ఎక్స్‌ప్రెస్‌వే వల్ల మీరట్, ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి ఆరు గంటలకు తగ్గనున్నది. లాజిస్టిక్, ట్రాన్స్పోర్ట్ సామర్థ్యం కూడా పెరగనున్నది. గంగా ఎక్స్‌ప్రెస్‌వేలో 3.5 కిలోమీటర్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కీలకంగా మారనున్నది. షాహజాన్‌పూర్‌లో దీన్ని నిర్మించారు. రక్షణ రంగం ఈ ల్యాండింగ్ స్ట్రిప్‌ను వాడనున్నది.
ఈ ఎక్స్ఫ్రెస్వే వల్ల లాజిస్టిక్ ఖర్చులు తగ్గనున్నటుల అధికారులు చరెప్పారు. వివిధ జిల్లాల్లో ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ కారిడార్ల మధ్య సహకారం పెరగనున్నది. వ్యవసాయం, పరిశ్రమలు,టూరిజం పెరగనున్నాయి.