రూర్కెలా: బీజేపీ పాలిత ఒడిశాలో వరుస గ్యాంగ్‌రేప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇద్దరు యువకులు ఒక బాలికపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. మరొక బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం బాధితులు మరో ఇద్దరితో కలిసి బర్సుయాన్లో విశ్వ కర్మ పూజ చూసి ఒక వాహనంలో నిర్జన అటవీ ప్రాంతం గుండా ఇంటికి తిరిగి వస్తుండగా బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఐజీ(పశ్చిమ రేంజ్) బ్రిజేశ్ కుమార్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కె బలంగ్ ప్రాంతానికి చెందిన బాధితుల వాహనాన్ని నిందితులు అడ్డగించి అందులోని వారిని భయభ్రాంతుల్ని చేశా రు. ఆ తర్వాత బాధితులపై దగ్గర్లోని ప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.