Terror Attack | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. గాందర్ బాల్ జిల్లా సోన్ మార్గ్ ప్రాంతంలోని ఒక సొరంగ మార్గం నిర్మాణం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు వలస కార్మికులు మరణించారు. తొలుత దాడి జరిగినప్పుడు ఇద్దరు వలస కార్మికులు మరణించగా, మరో వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరు గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఉగ్రదాడి జరిగిన సంగతి తెలుసుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. రెండు రోజుల క్రితమే షోపియాన్ జిల్లాలో బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు.