బీజేపీకి షాకిచ్చిన గాలి జనార్దన్‌రెడ్డి.. ఎన్నికల్లో కొత్త పార్టీతో బరిలోకి..!
Gali Janardhana Reddy | కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి అధికార బీజేపీకి షాక్ ఇచ్చారు. కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన సొంత పార్టీని స్థాపించారు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీని ఆదివారం ప్రకటించారు. అసెంబ్లీ
బెంగళూరు : కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి అధికార బీజేపీకి షాక్ ఇచ్చారు. కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన సొంత పార్టీని స్థాపించారు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీని ఆదివారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై గాలి జనార్దన్ రెడ్డి జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఆయన 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారు. బెయిల్ ఇచ్చే సమయంలో గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీం కోర్టు కొన్ని ఆంక్షలు విధించింది. పాస్‌పోర్టులను అప్పగించాలని, తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు కేసులు, వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనార్దన్ రెడ్డి పార్టీని స్థాపించడంతో కర్ణాటకలో సంచలనంగా మారింది. పార్టీని ప్రకటించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన జీవితంలో రాజకీయంగా మరో ఎపిసోడ్ ప్రారంభమైందని, కల్యాణ కర్ణాటక ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే తాను ఇక్కడ ఉన్నట్టు చెప్పారు.
రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విడగొట్టి లబ్ధి పొందాలనుకుంటే ఇక్కడ కుదరదన్న ఆయన.. కర్ణాటక ప్రజలు ఎప్పుడూ ఐక్యంగా ఉన్నారని, ఉంటారన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన మంత్రి శ్రీరాములుతో విభేదాలున్నట్లుగా వస్తున్న వార్తలపైనా స్పందించారు. కాషాయ పార్టీలో ఎవరితోనూ తనకు విభేదాలు లేవని, శ్రీరాములు తన బాల్య స్నేహితుడని, అతనితో సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

