న్యూఢిల్లీ : గగన్‌యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లబోతున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు చెప్పారు.
నాసా గుర్తించిన ప్రైవేట్ సంస్థ ఏక్సియోమ్ స్పేస్‌తో ఇస్రో స్పేస్ ఫ్లైట్ అగ్రిమెంట్ చేసుకుందని చెప్పారు. దీని మేరకు గగన్‌యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు రష్యాలో స్పేస్‌ఫ్లైట్ బేసిక్ మాడ్యూల్‌పై శిక్షణ పొందారని ఆయన తెలియజేశారు