న్యూఢిల్లీ : వింటర్లో మూవీ చూస్తూనో, పేపర్ చదువుతూనో హాట్ చాక్లెట్‌ను (Hot Chocolate) సిప్ చేయడాన్ని ఎంతోమంది ఆస్వాదిస్తుంటారు. మీకు ఇష్టమైన చాక్లెట్ మీ మగ్‌లో లిక్విడ్ వెర్షన్‌లా ఒదిగిపోతుంటే ఒక్కో సిప్‌ను ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక చాలా మంది తమ హాట్ చాక్లెట్ రెసిపీలతో ప్రయోగాలు చేస్తుంటారు.
అందులో రియల్ చాక్లెట్ పీస్‌ను జోడించడం, ఎక్స్ట్రా చాక్లెట్ సాస్, క్రీమ్‌ను కలపడం వంటివి చేస్తుంటారు. అయితే మీ ఓల్డ్ హాట్ చాక్లెట్ రెసీపీకి టేస్టీ ట్విస్ట్ ఇవ్వాలంటే కొన్నింటిని యాడ్ చేయవచ్చు.
అందులో ముఖ్యంగా కొద్దిగా సీ సాల్ట్‌ను కలిపితే మంచి టేస్ట్ రావడమే కాకుండా కొద్దిపాటి చేదును ఇది మటుమాయం చేస్తుంది. ఆరంజ్ జెస్ట్, హాట్ పెప్పర్, చాయ్ టీ, పెప్పర్మింట్ వంటి వాటిని హాట్ చాక్లెట్లో మిక్స్ చేసుకుని మంచి టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు.
Read More :
Apple | యాపిల్‌కు భారీ షాక్ : తన పేరిట 1000 పేటెంట్లు కలిగిన సీనియర్ డిజైనర్ గుడ్‌బై