Apple | యాపిల్‌కు భారీ షాక్ : తన పేరిట 1000 పేటెంట్లు కలిగిన సీనియర్ డిజైనర్ గుడ్‌బై
గత ఏడాది కాలంగా వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్లు సహా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కోల్పోతున్న టెక్ దిగ్గజం యాపిల్‌కు (Apple )మరో గట్టి షాక్ తగిలింది.
న్యూయార్క్ : గత ఏడాది కాలంగా వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్లు సహా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కోల్పోతున్న టెక్ దిగ్గజం యాపిల్‌కు (Apple )మరో గట్టి షాక్ తగిలింది. తన పేరిట 1000 కంపెనీ పేటెంట్లు కలిగిన సీనియర్ డిజైనర్ పీటర్ రసెల్ క్లార్క్ రాజీనామా చేశారు. టెక్ దిగ్గజంలో దాదాపు రెండు దశాబ్ధాల పాటు సేవలందించిన క్లార్క్ కంపెనీ నుంచి వైదొలిగారు.
యాపిల్‌లో క్లార్క్ చివరి ప్రముఖ సీనియర్ ఇండస్ట్రియల్ డిజైనర్ కావడం గమనార్హం. ఇప్పుడు క్లార్క్ నిష్క్రమణ యాపిల్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఐమ్యాక్, ఐప్యాడ్ నానో, మ్యాక్‌బుక్ ప్రొ, మ్యాక్‌బుక్ ఎయిర్ సహా యాపిల్ ప్రధాన ఉత్పత్తుల హార్డ్‌వేర్ డిజైన్‌ను ఆయన పర్యవేక్షించేవారు. పలు ఐఫోన్, ఐప్యాడ్ మోడల్స్‌కు డెవలప్మెంట్ టీంల్లో క్లార్క్ కీలక పాత్ర పోషించారు.
యాపిల్ ప్రధాన కార్యాలయం, రిటైల్ స్టోర్స్ లుక్‌ను డిజైన్ చేయడంలోనూ క్లార్క్ చొరవ ప్రశంసలు పొందింది. క్లార్క్ పేరిట ఏకంగా 1000కిపైగా యాపిల్ పేటెంట్స్ ఉండటం గమనార్హం. యాపిల్ నుంచి వైదొలగిన క్లార్క్ ప్రస్తుతం స్పేస్ టెక్నాలజీ కంపెనీ వాస్ట్లో చేరినట్టు సమాచారం. కంపెనీ ఇండస్ట్రియల్ డిజైన్ టీంను నిర్మించడంలో క్లార్క్ సలహాదారుగా వ్యవహరిస్తారు. తమ కంపెనీలో క్లార్క్ చేరారని వాస్ట్ తన బ్లాగ్‌పోస్ట్‌లో ధ్రువీకరించింది.
Read More :
Devarakonda Fort | రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నంగా నిలుస్తున్న దేవరకొండ ఖిలా..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

