న్యూఢిలీ: దేశంలోని రెస్ట్టారెంట్లు, కేఫ్‌లు, ధాబాలు, రోడ్డుపక్కన ఆహారం విక్రయించే దుకాణాలు సహా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ (ఎఫ్‌బీవో)లు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ యాప్‌కు కనెక్ట్ చేసే క్యూఆర్ కోడ్‌తోపాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేదంటే తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. వినియోగదారులకు సాధికారత కల్పించడం, ఆహార భద్రత, పరిశుభ్రత, తప్పుదారి పట్టించే ఉత్పత్తి లేబుళ్ల గురించి ఫిర్యాదులు దాఖలు చేయడాన్ని సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
దీనిని బట్టి ఎఫ్ఎస్ఎస్ఏఐలో భాగమైన క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా వినియోగదారులకు కనిపించే ప్రదేశాలైన బిల్లింగ్ కౌంటర్, డైనింగ్ సెక్షన్లో ఉంచాలి. వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా క్యూఆర్ స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.యాప్ ద్వారా ఒకసారి ఫిర్యాదు చేశాక వేగవంతమైన పరిష్కారం కోసం అది నేరుగా సరైన అధికారికి చేరుతుంది.