Water Bottles | న్యూఢిల్లీ, డిసెంబర్ 2 : ప్లాస్టిక్ క్యాన్స్, బాటిల్స్‌లో అమ్మే ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ‘హై-రిస్క్ ఫుడ్’ క్యాటగిరిలో చేర్చుతూ ఎఫ్ఎస్ఎస్ఏఐ(భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. హై-రిస్క్ క్యాటగిరిలో చేర్చటం ద్వారా ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్ భద్రత, నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. హై-రిస్క్ క్యాటగిరిలోని ఉత్పత్తుల భద్రత, నాణ్యత ప్రమాణాల మెరుగుదల కోసం తప్పనిసరిగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా తనిఖీలు నిర్వహించి లైసెన్స్ రెన్యువల్ చేస్తారు.