Coast Guard Rescues Fishermen | సముద్రంలో బోటుకు ప్రమాదం.. మత్స్యకారులను రక్షించిన కోస్ట్‌గార్డ్
Coast Guard Rescues Fishermen | సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురై మునగసాగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ ద్వారా 12 మంది మత్స్యకారులను రక్షించారు.
తిరువనంతపురం: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురై మునగసాగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ ద్వారా 12 మంది మత్స్యకారులను రక్షించారు. (Coast Guard Rescues Fishermen) కేరళలోని కొచ్చి తీరంలో ఈ సంఘటన జరిగింది. జనవరి 11న కొచ్చి సమీపంలోని మునంబమ్ పోర్ట్ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ‘సంజు’ అనే మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. బోటు కింద భాగం ధ్వంసం కావడంతో అందులోకి నీరు రావడంతో అది మునగసాగింది.
కాగా, ఆ పడవలోని మత్య్సకారులు కోస్ట్‌గార్డ్‌ను సహాయం కోరారు. దీంతో ఐసీజీఎస్ ఆర్యమాన్ నౌక, సీ-404, సీసి-144 బోట్లు, కోస్ట్ గార్డ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. 12 మంది మత్స్యకారులను రక్షించారు. మునుగుతున్న బోటును కూడా సురక్షితంగా తీరానికి చేర్చారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. కాపాడిన మత్స్యకారులకు ఆహారం, ప్రథమ చికిత్స అందిచినట్లు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

