ఇంఫాల్: మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంపై శుక్రవారం మూక దాడి జరిగింది. దుండగులు రాళ్లు, ఇతర వస్తువులను కార్యాలయంపైకి విసిరారు. కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. తూర్పు ఇంఫాల్ జిల్లా సరిహద్దుల్లోని సైబోల్ గ్రామం నుంచి కేంద్ర భద్రతా దళాలను ఉపసంహరింపజేయడంలో ఎస్పీ విఫలమయ్యారని ఈ దాడికి పాల్పడినవారు ఆరోపించారు.