Violence In Manipur | మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Violence In Manipur | మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. సాయుధ దుండగులు ఒక గ్రామంపై దాడి చేశారు. పలువురిపై కాల్పులు జరిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. సాయుధ దుండగులు ఒక గ్రామంపై దాడి చేశారు. పలువురిపై కాల్పులు జరిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (Violence In Manipur) భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో న్యూ కీథెల్మాన్బి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.10 గంటల సమయంలో సాయుధులైన దుండగులు లోయిబోల్ గ్రామంపై దాడి చేశారు. సాయుధ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పలు ఇళ్లకు వారు నిప్పంటించగా అవి కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటనతో ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామంపై దాడి చేసిన సాయుధ మిలిటెంట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభావిత ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అక్కడి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

