కాట్రా: జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణవోదేవి(Mata Vaishno Devi) ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త ట్రెక్కింగ్ రూట్లో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. రియాసీ జిల్లాలోని త్రికూట పర్వతాలపై ఆ ఆలయం ఉన్నది. కొండచరియలు విరిగిపడడంతో ఆ రూట్లో ట్రాక్‌ను మూసివేశారు. వర్షాల వల్ల అక్కడ కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే పాత మార్గంలో యాత్ర సజావుగా సాగుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం బ్యాటరీ కారు, హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు. హిమకోటి రూట్లో ఉన్న సత్యా వ్యూ పాయింట్ దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్ని రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. భక్తులను కొత్త ట్రాక్‌లో వెళ్లనివ్వడం లేదు. భైరవ్ ఆలయం వైపు వెళ్లే ట్రాక్ రూట్లో కూడా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెప్పారు. రెండు ట్రాక్‌ల వద్ద పడిన కొండచరియలను తొలగిస్తున్నారు.
Mata Vaishno Devi yatra :Landslides near Hemkoti on new track pic.twitter.com/rV7f1JOewD
— Cross Town News (@CrossTownNews) June 24, 2025