ఉదయ్‌పూర్: బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫ్రెంచ్ పర్యాటకురాలిపై లైంగికదాడి జరిగింది. ఓ పార్టీలో కలిసిన వ్యక్తి ఆమెను తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ నెల 23న బాధితురాలు టైగర్ హిల్ సమీపంలోని ఓ కెఫెలో జరిగిన పార్టీకి హాజరైంది. అక్కడ ఆమె నిందితుడిని కలిశారు.
‘బయటికెళ్లి పొగ తాగుదాం. చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రదేశాలు నీకు చూపిస్తా’ అని నిందితుడు ఆ పార్టీ నుంచి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. తాను బస చేసిన హోటల్‌కు తిరిగి వెళతానని ఆమె అభ్యర్థించినప్పటికీ అతడు ఆమెను తన అద్దె ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉండటంతో ఆమె సాయం కోసం ఎవరినీ పిలవలేకపోయింది. అక్కడ అతడు ఆమెను ఓ కౌగిలింత ఇవ్వమని అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆమెపై లైంగిక దాడి చేశాడు.