Cancer Screening |న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : అధిక రక్త ప్రసరణ(హైబీపీ), మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31 వరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. 30 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు తమ సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఈ వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
హైబీపీ, డయాబెటిస్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తాయని ప్రభుత్వం ఎక్స్ వేదికగా తెలిపింది. చూపు మందగించడం, ఆకలి పెరగడం, గాయాలు మానకపోవడం, అలసట, తరచు దాహం వేయడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, తరచు మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మందికి, అంటే సుమారు 500 కోట్ల మందికి మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో లేదని, తక్కువ, మధ్యస్థాయి ఆదాయం గల దేశాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని లాన్సెట్ కమిషన్ తాజా నివేదిక వెల్లడించింది. శస్త్ర చికిత్స, ఉబ్బసం, అత్యవసర చికిత్సను పొందే రోగులతోపాటు ప్రసవ సమయంలో తల్లీ, బిడ్డల ఆరోగ్య రక్షణకు అందచేసే చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ అత్యవసరం.