అప్పటిదాకా తండ్రితో కలిసి సరదాగా ఆడుకున్నది. ఐస్‌క్రీం తినేందుకు షాప్‌కు వెళ్లింది. ఐస్క్రీంలున్న ఫ్రిజ్‌ను చూడగానే మురిసిపోయింది. ఇష్టమైన ఐస్క్రీంను సెలెక్ట్ చేసుకునేందుకు ఫ్రిజ్‌పైకి ఎక్కింది. కరెంట్ షాక్ రావడంతో గిలగిలా కొట్టుకున్నది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది.
గ్రీష్మ అనే నాలుగేళ్ల చిన్నారి తన తండ్రి విశాల్ కులకర్ణితో కలిసి ఐస్ క్రీం తెచ్చుకునేందుకు ఇంటిపక్కనే ఉన్న షాప్‌కు వెళ్లింది. అక్కడ బయట ఉంచిన ఫ్రిజ్ చూడగానే తండ్రిని వదిలేసి దానిపైకి ఎక్కింది. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. ఫోన్లో బిజీగా ఉన్న తండ్రి చిన్నారిని గమనించలేదు. కొద్దిసేపటితర్వాత చూస్తే గ్రీష్మ ఫ్రిజ్వద్ద స్పృహ తప్పిపడిపోయి ఉంది. విశాల్ వెంటనే తన కూతురును సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్టు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఐస్‌క్రీం తినేందుకు వెళ్లిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కులకర్ణి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానిక ప్రజలను కలిచివేసింది.