ఇంఫాల్:మణిపూర్లో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. గురువారం బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో మరో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు, హింస కొనసాగుతున్నాయని పోలీస్ అధికారులు మీడియాకు తెలిపారు.
మృతుల్లో తండ్రీకొడుకులున్నారని, ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు చెప్పారు. ‘ఐదుగురు లేదా ఆరుగురితో కూడిన సాయుధ దుండగులు వ్యవసాయ పనులు జరుగుతున్న చోటకు వచ్చి హఠాత్తుగా కాల్పులకు దిగారు’ అని తెలిపారు.