ADR | న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఏపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 65 కోట్లు అని, ఇది దేశంలోనే అత్యధికమని తేల్చింది. పార్టీ పరంగా చూస్తే దేశ వ్యాప్తంగా బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఆస్తులు కూడగట్టారని చెప్పింది. బీజేపీకి చెందిన ముంబై, ఘట్కోపర్ తూర్పు ఎమ్మెల్యేగా పరాగ్ షా రూ.3,400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. దేశంలోని టాప్-10 సంపన్న ఎమ్మెల్యేల్లో నలుగురు టీడీపీకి చెందినవారే. తెలంగాణ ఎమ్మెల్యే జీ వివేకానంద (చెన్నూరు) 11 వ స్థానంలో ఉండగా, కే రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) 15, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు) 19వ స్థానంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ – 65.07
కర్ణాటక – 63.58
మహారాష్ట్ర – 43.44
తెలంగాణ 38.00
త్రిపుర – 1.51
బెంగాల్ – 2.80
కేరళ – 3.13
దేశంలోనే సంపన్న ఎమ్మెల్యే- పరాగ్ షా (బీజేపీ- ఘట్కోపర్ తూర్పు, ముంబై)
అతి తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యే- నిర్మల్ కుమార్ ధారా (ఇండస్, పశ్చిమ బెంగాల్)