ముంబై: మహారాష్ట్రలోని (Maharashtra) వషీమ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జిల్లాలోని సెలుబజార్ సమీపంలో ట్రాక్టర్‌ను వ్యాన్ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
నాగ్‌పుర్‌లో జరిగిన వివాహవేడుకకు హాజరై వస్తుండగా ఈ విషాదం జరిగిందని వషీమ్ ఎస్పీ బచ్చన్ సింగ్ తెలిపారు. వ్యాన్అదుపు తప్పి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిందని తెల్లడించారు. ఈ ప్రమాదంలో లో నలుగురు మృతిచెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. బాధితులంతా సవాంగా జెహంగిర్ గ్రామానికి చెందిన వారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.