లోక్‌పాల్‌గా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్!
తదుపరి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఎంపికైనట్టు సమాచారం. ప్రధాని మోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నియామకానికి బుధవారం ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తదుపరి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఎంపికైనట్టు సమాచారం. ప్రధాని మోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నియామకానికి బుధవారం ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌పాల్ అనేది అవినీతి నిరోధక అధికారం కలిగిన స్వతంత్ర న్యాయాధికార (అంబుడ్స్‌మన్) సంస్థ.
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణల్ని విచారించే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. 2022 మే నుంచి లోక్‌పాల్ యాక్టింగ్ చైర్‌పర్సన్‌గా జార్ఖండ్ హైకోర్టు మాజీ సీజే ప్రదీప్ కుమార్ మొహంతి వ్యవహరిస్తున్నారు. 2022, జూలై 29న సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ పదవీ విరమణ పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనాలు.. పలు కీలక కేసుల్లో తీర్పులు వెలువరించాయి. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి క్లిన్‌చిట్ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో రిటైర్ అవుతారనగా..‘పీఎంఎల్ఏ’ చట్టంలోని కఠిన నిబంధనల్ని జస్టిస్ ఖాన్విల్కర్ ధర్మాసనం సమర్థించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

