జలంధర్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, జలంధర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జీత్ సింగ్ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తానీల కోసం వాఘా సరిహద్దును తెరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జలంధర్‌ను మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, పాకిస్థాన్ ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి వైద్య చికిత్స పొందేందుకు వాఘా సరిహద్దును తెరుస్తామని ప్రకటించారు.