న్యూఢిల్లీ, డిసెంబర్ 25 : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా ఆయన స్మారక స్థూపం ‘సదైవ్ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తదితర రాజకీయ ప్రముఖులు బుధవారం నివాళి అర్పించారు. అక్కడే జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, అధికార పక్ష ఎంపీలు పాల్గొని అటల్ సేవలను స్మరించుకున్నారు. వాజ పేయి శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.100 స్మారక నాణేన్ని, తపాల స్టాంప్‌ను విడుదల చేశారు.