న్యూఢిల్లీ: ఒడిశా మాజీ చీఫ్ జస్టిస్ ఎస్ మురళీధర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఏర్పాటు చేసిన ఐరాస ప్యానెల్‌కు ఆయన నేతృత్వం వహించనున్నారు. ముగ్గురు సభ్యుల కమిషన్‌కు ఆయన చీఫ్‌గా వ్యవహరిస్తారు.
2023లో పదవీ విరమణ చేసిన మురళీధర్ ఆక్రమిత పాలస్తీనాపై ఐరాస ఏర్పాటు చేసిన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు బ్రెజిలియన్ న్యాయ నిపుణుడు పాలో సెర్గియో తర్వాత నేతృత్వం వహించనున్నారు.