న్యూఢిల్లీ, మే 27 (నమస్తే తెలంగాణ): నూతన పార్లమెంటుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మాజీ ఎంపీ, ఆల్ఇండియా నేషనల్ కాన్ఫడరేషన్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ ఉదిత్‌రాజ్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఢిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన పార్లమెంటుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని 6 డిసెంబర్ 2021 నుండే ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు.
మోదీకి లేఖ పంపించామని చెప్పారు. దేశ రాజధాని రా మ్లీలా మైదానంలో ఓ ఉద్యమంలా బహిరంగ సభలు నిర్వహించామన్నారు. నూతన పార్లమెంట్‌కు షా వర్కర్స్ పార్లమెంట్ హౌస్ అని నామకరణం చేయబోతున్నారని, ఈ పేరు పెట్టకుండా అడ్డుకుంటామన్నారు. రాష్ట్రపతి చేతులు మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నేషనల్ కోఆర్డినేటర్ మహేశ్వర్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.