బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. దీంతో ఆయనను పదునైన ఆయుధంతో కడుపు, మెడ భాగాల్లో పొడిచి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన భార్యను, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపించారు. ఓం ప్రకాశ్ డీజీపీ, ఐజీగా 2015 నుంచి 2017 వరకు పని చేశారు.