కర్ణాటక మాజీ సీఎంపై పోక్సో కేసు
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తన కుమార్తెపై 81 ఏండ్ల యెడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 17 ఏండ్ల బాలిక తల్లి సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
- న్యాయపరంగా ఎదుర్కొంటానన్న యెడియూరప్ప
బెంగళూరు, మార్చి 15: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తన కుమార్తెపై 81 ఏండ్ల యెడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 17 ఏండ్ల బాలిక తల్లి సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన యెడియూరప్ప దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. దీనిపై హోంమంత్రి జి పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘ఫిర్యాదు ఇచ్చిన మహిళ మానసిక స్థితి సరిగా లేదని కొందరు అంటున్నారు.
ఫిబ్రవరిలో ఆ మహిళ, ఆమె కుమార్తె యెడియూరప్ప ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని ఆ మహిళ ఆరోపిస్తున్నది’ అని పేర్కొన్నారు. కాగా, కేసును తదుపరి దర్యాప్తు కోసం సదాశివనగర్ పోలీస్ స్టేషన్ నుంచి సీఐడీకి బదిలీ చేస్తూ డీజీపీ అలోక్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.ఆ మహిళ తనను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించినా తాను అనుమతించలేదని యెడియూరప్ప చెప్పారు. ఒకసారి ఏడుస్తుండగా, ఆమెను లోపలికి పిలిచామని, తర్వాత పోలీస్ కమిషనర్ సదానంద్తో ఆమె సమస్యను చూడమని చెప్పానన్నారు. అయితే తన ఎదురుగానే తనకు వ్యతిరేకంగా మాట్లాడటం చూసి ఆమె ఏదో తేడాగా ఉందని గ్రహించానన్నారు. బాలిక తల్లి గతంలో అప్పటి బెంగళూరు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్, అతని సిబ్బంది సహా పలువురిపై 50కు పైగా ఫిర్యాదులు చేసినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

